Monday, January 20, 2025

రాజకీయాలకు కేశినేని నాని గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

విజయవాడ మాజీ ఎంపి కేశినేని రాజకీయలకు గుడ్‌బై చెప్పారు. సోమవారం సోషల మీడియా ఎక్స్ వేదికగా తన రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. కేశినేని నాని 2014, 2019లో తెలుగుదేశంపార్టీ తరపున విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి విజయవాడ లోక్‌సభ స్థానం నుండి ఆయన సోదరుడు కేశినేని చిన్నిపై పోటీ చేసి ఓటమిపాలైయ్యారు.

జాగ్రత్తగా ఆలోచించే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News