Monday, December 23, 2024

వైసిపిలోకి కేశినేని?

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ ఎంపి కేశినేని నాని టిడిపి పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరునున్నట్టు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సంక్రాంతి తరువాత నాని వైసిపిలో చేరనున్నట్టు సమాచారం. నాని వైసిపిలో చేరితే 2024 పార్లమెంట్ ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపిగా పోటీ చేసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన వైసిపి ఎంఎల్‌ఎలతో కలిసి తిరుగుతున్నారు. ఎంపి నియోజకవర్గ నిధులు కూడా వైసిపి పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు ఆరోపణలు వచ్చాయి. టిడిపి కార్యకర్తలు పలుమార్లు ఈ విషయం అడగడంతో ప్రొటోకాల్ పేరుతో తన చేసిన పనిని సమర్ధించుకునేవాడు. కేశినేని నాని కూతురు శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 11వ వార్డు టిడిపి కార్పొరేటర్‌గా ఉన్నారు. సోమవారం శ్వేత తన పదవికి రాజీనామా చేసి అనంతరం రాజీనామా పత్రాన్ని మేయర్ భాగ్యలక్ష్మికి ఇచ్చారు. టిడిపి కూడా రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News