Monday, December 23, 2024

కస్టడీలో నాపై పోలీసులు దాడి చేశారు: నటి కేతకి చితాలే

- Advertisement -
- Advertisement -
Ketaki
ఎన్‌సిపి నేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్ చేశారనే ఆరోపణతో తనను అదుపులోకి తీసుకున్న తర్వాత వేధించారని మరాఠీ నటి కేతకీ చితాలే అన్నారు.

ముంబై: ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను దూషించినందుకు అరెస్టయిన మరాఠీ నటి కేతకి చితాలే  పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఎన్‌సిపి సభ్యులు తనను దుర్భాషలాడారని మంగళవారం వెల్లడించారు.  అన్యాయంగా తన ఇంటి నుండి తీసుకెళ్లారని, అరెస్టు వారెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా జైలులో పెట్టారని ఆమె తెలిపారు. తనపై దాడి చేసి కొట్టారని నటి పేర్కొంది. ఎంవిఏ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆమె విమర్శించారు.

కేతకి సిఎన్ఎన్ న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నన్ను  తీసుకెళ్ళారు, అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కస్టడీ చేతులు మారింది. కలంబోలి నుండి నన్ను థానే పోలీసు కస్టడీకి అప్పగించారు.  అక్కడ ఉన్న ఎన్ సిపి మహిళలు నన్ను కొట్టారు. వారు విలేకరులతో పాటు దాదాపు 20 మంది గుంపుగా వచ్చారు. అయితే, విలేకరులు నన్ను వేధించలేదు. కానీ వారు (ఎన్‌సిపి కార్యకర్తలు) నాపై రంగులు విసిరారు. ఇది సిరా అని వారు చెప్పారు, కానీ అది సిరా కాదు. అది విషపూరిత నలుపు రంగు, మన చర్మానికి చాలా హానికరం. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు వారు ఆ రంగును నాపైకి విసిరారు, గుడ్లు విసిరారు. పోలీస్ కాంపౌండ్ లోపల పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది చట్టవిరుద్ధం, చట్టవిరుద్ధం’’ అని పేర్కొన్నారు. కాగా జైలులో తనపై బలాత్కారం కూడా జరిగిందని ఆమె ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News