Sunday, December 22, 2024

కేతకి హుండీ ఆదాయం లెక్కింపు

- Advertisement -
- Advertisement -
  • 26 రోజులకు రూ. 18.14 లక్షల ఆదాయం

ఝరాసంగం: జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి హుండీ ఆదాయాన్ని భారీగా పెరిగింది. మంగళవారం 26 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. 26 రోజులకు గాను రూ.1,814,690 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. తెలుగు రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకల రూపంలో స్వామి వారి హుండీలో కానుకల రూపంలో వేసిన నగదు, నాణేలు లెక్కించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ నీల వెంకటేశం, ఆలయ ఈవో శశిధర్, ధర్మకర్తల పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణానికి చెందిన రాజరాజేశ్వర సేవాసమితికి చెందిన 99 మంది భక్తులు, అర్చక సిబ్బంది, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.

లెక్కింపు కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది. మంగళవారం 26 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా రూ.1,814,690 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. హుండీలో 224 అమెరికన్ డాలర్స్ రావడం విశేషం. వెండి బంగారు ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ రంగారావు, కేతకి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, ఆలయ కార్య నిర్వాణ అధికారి శశిధర్, పాలక మండలి సభ్యులు ఎంపి నాగన్న పటేల్, మల్లికార్జున్, లక్ష్మయ్య, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News