హైదరాబాద్: కేతనపల్లి పురపాలక పేరును రామకృష్ణాపూర్‌గా పేరు మార్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జిహెచ్‌ఎంసి, పురపాలక చట్ట సవరణ బిల్లు, జిఎస్‌టి చట్ట సవరణ బిల్లు, అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులకు శాషన సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ములుగు పంచాయతీని పురపాలికసంఘంగా మార్చుతున్నామన్నారు. ములుగును పురపాలికగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ములుగు ఎంఎల్‌ఎ సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ములుగులో మౌలిక సదుపాయాలు కల్పించా అభివృద్ధి చేయాలని సీతక్క కోరారు. ములుగులో త్వరగా కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ చెప్పారు. ఎవరూ అడగకున్నా ములుగుకు వైద్య కళాశాల ఇచ్చామని గుర్తు చేశారు. మా పథకాల అమలులో స్వపక్షం, విపక్షం తేడా చూడమని కెటిఆర్ తెలియజేశారు.
స్వపక్షం, విపక్షం తేడా చూడం: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -