Saturday, December 28, 2024

అందాలు అదరహో

- Advertisement -
- Advertisement -

హీరోయిన్లు అందాలు ఆరబోస్తేనే ఇప్పుడు అందాల భామలకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ పాత్రల కోసమే ముద్దుగుమ్మలను తీసుకుంటున్నారు మేకర్స్. ఈ రోజుల్లో అందాలు ఆరబోయని భామలు చాలా తక్కువ. అందరూ అదే పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్‌లో ఒక్కో హీరోయిన్ చూపించే అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో అవకాశాల కోసం కాకపోయినా ఇన్ స్టాగ్రామ్‌లో పాపులారిటీ, ఫాలోవర్స్ కోసమని చాలామంది భామలు నిత్యం కవ్వించే ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ఆ జాబితాలో కేతిక శర్మ ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందచందాలతో యూత్‌ను మైమరపిస్తోంది. పూరి జగన్నాధ్ తీసిన ‘రొమాంటిక్’ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఈ యంగ్ బ్యూటీ. ఆ సినిమాలో ఈ భామ సోయగాల షో చూసి మరో రెండు సినిమాల్లో ఆఫర్లు ఇచ్చారు. నాగ శౌర్య సరసన ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది కేతిక శర్మ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News