Monday, December 23, 2024

నీట్ పేపర్ చోరీ చేసిన కీలక నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నీట్ యుజి ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన గది నుంచి ఒక ప్రశ్నాపత్రాన్ని చోరీ చేసిన కీలక నిందితుడితోసహా ఇద్దరు వ్యక్తులను నీట్ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు మంగళవారం అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరి అరెస్టుతో నీట్ పేపర్ లీకేజీ, నకిలీ అభ్యర్థిత్వం, ఇతర అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు సిబిఐ అధికారులు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 14కి చేరుకుంది.

జెంషెడ్‌పూర్‌లోని ఎన్‌ఐటికి చెందిన 2017 బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్యను ప్రశ్నాపత్రం చోరీకి సంబంధించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బొకారోకు చెందిన కుమార్‌ను పాట్నాలో అరెస్టు చేశారు. నీట్ యుజి ప్రశ్నాపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) భద్రపరిచిన గది నుంచి ఒక ప్రశ్నాపత్రాన్ని చోరీ చేయడంలో కుమార్‌కు సాయపడి, ఆ పేపర్‌ను వేరే గ్యాంకు చేర్చిన రాజు సింగ్ అనే వ్యక్తిని కూడా సిబిఐ అధికారులు హజారీబాగ్‌లో అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News