- Advertisement -
ఢిల్లీ: కరోనా చికిత్సలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు కీలక మార్పులు చేసింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులు అవసరం లేదని తెలిపింది. కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఐవర్ మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్ మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తెలిపింది. జ్వరానికి యాంటీపైరెటిక్, జలుబుకి యాంటీట్యూసిన్ వాడితే చాలు అని, అనవసరంగా బాధితులకు సీటీ స్కాన్లు చేయించొద్దని సూచించింది. కొవిడ్ కట్టడికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది.
- Advertisement -