Friday, December 20, 2024

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: టిటిడి ఛైర్మన్ బిఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను బిఆర్ నాయుడు మీడియాకు వివరించారు. వాటిలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని నిర్ణయించారు. సర్వదర్శనానికి భక్తులకు  రెండు నుంచి మూడు గంటల్లో దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించారు. మూడు నెలల్లో డంపింగ్ యార్డ్ లోని చెత్తను తొలగించనున్నారు. దేవాలయంలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకోనున్నారు.  ప్రయివేట్ బ్యాంకుల నగదును ప్రభుత్వ బ్యాంకుకు బదలాయించనున్నారు. శారదా పీఠం లీజు భూమిని స్వాధీనం చేసుకోనున్నారు. కొత్తగా నిర్మించిన ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేయనున్నారు. ఈ వివరాలను బిఆర్. నాయుడు మీడియాకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News