Thursday, December 12, 2024

ప్రార్థనా స్థలాల సర్వే పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రార్థనా స్థలాలపై నిర్వహిస్తున్న సర్వేలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రర్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తేవొద్దని స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఆయనతోపాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్, శరద్ పవార్, మనోజ్ కుమార్ ఝా తదితరులు కూడా వేర్వేరు పిటిషన్లు వేశారు. వీటన్నిటిపై నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాక పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదంటూ జిల్లా కోర్టులు, హైకోర్టులను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి. విశ్వనాథన్ లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలిపేంత వరకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News