Wednesday, January 22, 2025

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో కీలక ఘట్టాలు

- Advertisement -
- Advertisement -

Key events in Russia-Ukraine crisis

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశించిన దరిమిలా భారతీయ కాలమానం ప్రకారం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో జరిగిన పరిణామాలు:
ఉదయం 4.52: ఉక్రెయిన్‌పై రష్యా మరిన్ని సైబర్ దాడులు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ క్రాష్.
ఉ.8.22: ఉక్రెయిన్‌పై మీ సైనికుల దాడులను ఆపి, శాంతికి ఒక అవకాశం ఇవ్వండి అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ విజ్ఞప్తి.
ఉ.8.30: తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక్య చర్య చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన. రష్యా చర్యలలో ఏ దేశమైనా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అనూహ్య పరిణామాలు చూడాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరిక.
ఉ.9.04: ప్రత్యర్థి నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేనప్పటికీ, అసమర్థనీయమైన దాడులు చేయడాన్ని ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. దీనికి రష్యాను జవాబుదారీ చేస్తామని బైడెన్ ప్రతిన.
ఉ.9.19: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మరింత ఉగ్రరూపం దాల్చకుండా తక్షణం సంయమనం పాటించాలని భారత్ పిలుపు.
ఉ.9.47: ఉక్రెయిన్‌లోని ఒడెసా, ఖర్కీవ్ నగరాలలో పేలుళ్లు.
ఉ.10.29: ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు, ఇతర సైనిక ఆస్తులపై దాడులు చేసినట్లు రష్యా సైన్యం ప్రకటన.
ఉ.10.34: సైనిక చట్టం విధిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన. రష్యా సైనిక దాడులు ప్రారంభించిన నేపథ్యంలో పౌరులు భయాందోళన చెందవద్దని పిలుపు.
ఉ.11.30: ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధమున్న అన్ని దేశాలు సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి
మధ్యాహ్నం12.18 ఉక్రెయిన్ రక్షణ ఆస్తులు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటన.
మ.12.30: ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేసే లక్షంతో ప్రత్యేక సైనిక చర్య చేపట్టినట్లు పుతిన్ ప్రకటన.
మ.1.16: గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన, తీవ్రమైన ఆంక్షలను(రష్యాపై) విధించే విషయాన్ని యూరోపియన్ యూనియన్ పరిశీలిస్తున్న ఇయు అధికారి ప్రకటన.
మ.2.40: రక్షణ రంగానికి చెందిన సహాయాన్ని అందచేయవలసిందిగా ప్రపంచ దేశాల నాయకులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెనస్కీ అభ్యర్థన. రష్యా నుంచి ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను కాపాడాలని విజ్ఞప్తి.
మ.3.21: తమ దేశంపై దాడుల తర్వాత రష్యాతో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన.
మ.3.32: తమ దేశంపై రష్యా సైన్యం జరిపిన దాడులలో ఇప్పటివరకు సుమారు 40 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారుడు వెల్లడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News