Saturday, November 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికన్ నుంచి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. తాజాగా, ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. హైదరాబాద్ పట్టణంలోని కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేర కు కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో మూడు సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు ఐదు మాక్ మినీ డివైజ్‌లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడిం చారు. దీంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు.

ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఆయన నుంచి సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇఫ్పటికే టెక్నికల్ ఎవిడెన్స్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టినట్లు సిట్ వెల్లడిం చింది. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించారు. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో స్వాధీనం చేసుకున్న పరికరాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సిఆర్‌పిసి నోటీస్ జారీ చేసి స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేపడుతోంది. త్వరలోనే మరిన్ని కీలక ఆధారాలు వెల్ల డించనున్నట్లు సిట్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News