- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియర్ల వేధింపులో కుటుంబమంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. పప్పుల సురేష్ కుటుంబం సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. సురేష్ వేధింపుల సూసైడ్ సెల్ఫీ వీడియోను తన బంధువులకు పంపాడు. ప్లాట్ వేలం, అప్పు తీర్చాలని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నట్టు సెల్పీ వీడియో తీసుకున్నాడు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సూసైడ్ నోట్‌లో నలుగురు పేర్లను రాసినట్టు ఉంది.
- Advertisement -