ఢిల్లీ: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో శనివారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు పాశ్వాన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీహార్ లో జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారని పార్టీ వర్గాలు చెప్పాయి. జేడీయూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంపై బిజెపి అధిష్టానం వ్యూహం రచిస్తోంది. బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటుపై బిజెపి చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బిజెపి పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది.
అటు బీహార్ లో రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్, ఆర్జేడీ పోటాపోటీగా సమావేశాలు పెడుతోంది. మధ్యాహ్నం ఆర్జేడీ కీలక నేతలు భేటీ కానున్నారు. డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో సమావేశం జరగనుంది. పూర్ణియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీకానున్నారు. సాయంత్రం 4 గంటలకు బిజెపి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.