Friday, December 20, 2024

ఫోన్‌ట్యాపింగ్ లో కీలక వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి, ఓఎస్‌డిగా సేవలందించిన రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో రాధాకిషన్ రావు బృందం అనధికారికంగా ఆపరేషన్లు చేపట్టిందని ఆరోపణలు రావడంతో అతడిని డిసిపి విజయ్ కుమార్ బృందం అదుపులోకి తీసుకొని విచారించారు. ఎవరి చెప్పడంతో ప్రణీత్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని రాధాకిషన్‌రావును పోలీసులు విచారించారు. శుక్రవారం ఆయన న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్‌పిలతో పాటు రాధాకిషన్ రావు, విశ్రాంత ఐజి ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వహకుడు శ్రవణ్ రావు ఇళ్లలో పోలీసులు కొద్ది రోజుల కిత్రం సోదాలు నిర్వహించారు. ఇద్దరు అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేయగా మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముగ్గురు విదేశాలకు పారిపోయినట్టు సమాచారం తెలియడంతో పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌తో పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు సమాచారం. రాధాకిషన్ రావును విచారిస్తున్న క్రమంలో బేగంబజారులోని కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News