Monday, January 20, 2025

శరవేగంగా దేవర షూటింగ్.. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌లపై కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇటీవల హీరోహీరోయిన్లతో భారీ సెట్స్ నడుమ క్రేజీ సాంగ్‌ని షూటింగ్ చేయగా… ప్రస్తుతం ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌లతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News