Sunday, January 12, 2025

ఇస్రో స్పాడెక్స్ డాకింగ్ మిషన్‌లో కీలక ముందడుగు

- Advertisement -
- Advertisement -

మూడు మీటర్ల దూరానికి ఉపగ్రహాలు
డిసెంబర్ 30న ఇస్రో స్పాడెక్స్ ప్రయోగం
కొనసాగుతున్న డాకింగ్ ప్రక్రియ
డాకింగ్ విజయవంతమైతే ఆ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్
భారత భావి ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం

బెంగళూరు : భవిష్యత్ ప్రయోగాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. స్పాడెక్స్ ఉపగ్రహాలు చేజర్, టార్గెట్ రెండింటినీ విజయవంతంగా మూడు మీటర్ల దూరానికి తీసుకువచ్చారు. డేటా విశ్లేషణ అనంతరం డాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. డిసెంబర్ 30న ఈ మిషన్‌ను ఇస్రో లాంచ్ చేసింది. చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే దీని లక్షం.

ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగవ దేశంగా భారత్ అవతరిస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద ఉంది. చంద్రునిపై నమూనాలు సేకరించి భూమిపైకి తీసుకురావడం, అంతరిక్షంలో భారత సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రునిపైకి మనుషులను పంపడం వంటి లక్షాలకు ఈ ప్రయోగం ఎంతో కీలకం. ప్రస్తుతం డాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News