Monday, December 23, 2024

యాదాద్రికి కిలో బంగారం….

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంకు యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఇఒకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచనల మేరకు ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట) నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం యదాద్రి నరసింహుడికి మంత్రి పువ్వాడ దంపతులు స్వామి వారికి కిలో బంగారంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులను ఆలయ అధికారులు, అర్చకులు శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News