Monday, December 23, 2024

‘కెజీఎఫ్ 2’ విడుదల తేదీ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

KGF 2 to Release on April 14

రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కెజీఎఫ్. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి రెండో భాగంగా ‘కెజీఎఫ్ 2’ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. మంగళవారం మూవీ టీమ్ కొల్లూరు శ్రీ మూంగాంబికా ఆలయాన్ని, అనేగుడ్డె శ్రీవినాయక టెంపుల్ ను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘కెజీఎఫ్ 2’ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందని స్పష్టం చేశారు. ఈ మూవీలో రవీనాటండన్, సంజయత్ దత్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

KGF 2 to Release on April 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News