Tuesday, December 24, 2024

‘కేజీయఫ్ చాఫ్టర్ 2’ నుంచి ‘తూఫాన్’..

- Advertisement -
- Advertisement -

KGF 2: TOOFAN lyrical Song to release on March 21st

హైదరాబాద్: కన్నడ రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన చిత్రం ‘కేజీయఫ్’. ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి రెండో పార్ట్ గా తెరకెక్కిన ‘కేజీయఫ్ చాఫ్టర్ 2’ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ‘తూఫాన్’ అనే సాంగ్ ను మార్చి 21న ఉదయం 11.07గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు మేకర్స్. హోంబలే నిర్మాణ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా, ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో యష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

KGF 2: TOOFAN lyrical Song to release on March 21st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News