Wednesday, January 22, 2025

కెజిఎఫ్ నటుడు కృష్ణ జి రావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కెజిఎఫ్ ఫ్రాంచైస్‌లో అంధుడి పాత్రలో నటించిన సీనియర్ కన్నడ నటుడు కష్ణ జి రావు కన్నుమూశారు. 70 సంవత్సరాల కృష్ణ జి రావు బుధవారం మరణించినట్లు కెజిఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హొంబళె ఫిల్మ్ తన అధికారిక ట్విటర్ హ్యాండలిల్‌లో వెల్లడించింది. బెంగళూరులోని వినాయక ఆసుపత్రిలో కృష్ణ జి రావు వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

కెజిఎఫ్ 2లో ప్రముఖ పాత్రలో నటించిన ప్రముఖ నటి రవీనా టాండన్ కృష్ణ జి రావు మృతికి సంతాపం ప్రకటించారు. త్వరలో విడుదల కానున్న నానో నారయణప్ప అనే కన్నడ చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. నటుడిగా, సహాయ దర్శకుడిగా అనేక సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్న కృష్ణ జి రావు మృతికి కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News