Wednesday, January 22, 2025

కెజిఎఫ్, కాంతార నిర్మాతల రూ. 3,000 కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

న్యూసడెస్క్: కెజిఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన హొంబళే ఫిల్మ్ రానున్న ఐదేళ్లలో రూ. 2,000 కోట్లను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెట్టనున్నట్లు హొంబళె ఫిల్మ్ వ్యవస్థాపకుడు విజయ్ రిరగండూర్ వెల్లడించారు. అన్ని దక్షిణాది భాషలలో చిత్రాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ. 3,000 కోట్లను సినీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

భారతీయ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని రకాల జోనర్లలో చిత్రాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఏడాదికి ఐదు లేదా ఆరు చిత్రాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దక్షిణాది భాషలు అన్నిటిలో చిత్రాలు నిర్మించాలన్నది తమ ఆలోచనని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథలతో మరింత మంది ప్రేక్షకులకు చేరుక కావాలన్నదే తమ భావనని ఆయన చెప్పారు.

మన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన కథావస్తువులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ కావాలన్నదే తమ లక్షమని విజయ్ చెప్పారు. యువ తరానికి మన సంస్కృతిని పరిచయం చేయడం కూడా తమ ఉద్దేశమని ఆయన అన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా తాము తోడ్పడతామని ఆయన అన్నారు. ప్రస్తుతం హిందీలో చిత్ర నిర్మాణానికి తగిన కథ కోసం అన్వేషిస్తున్నామని విజయ్ తెలిపారు. కథ సిద్ధమైన తర్వాత దర్శకులు, నటుల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

రచయితలపైనే తాము దృష్టిని పెడుతున్నామని, వారితోనే కథలు పుడతాయని ఆయన చెప్పారు. ప్రభాస్ హీరోగా తమ సంస్థ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల అవుతుందని ఆయన చెప్పారు. ఇది కాక బహుభాషా చిత్రం ధూమం, కన్నడ యాక్షన్ చిత్రం బఘీరా, కీర్తి సురేష్ కథానాయికగా తమిళ చిత్రం రఘుతాత ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News