Thursday, January 23, 2025

‘భీమా’లో జాయిన్ అయిన కేజీఎఫ్ ఫేమ్

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే ఈ చిత్రానికి సంబధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు.

కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ తాజాగా ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా లొకేషన్ తో పాటు స్టూడియోలోని ఫోటోలని చిత్ర యూనిట్ షేర్ చేసింది. హీరో గోపీచంద్ ఖాకీ యూనిఫాంలో కనిపించగా మరో ఫోటోలో కంపోజర్ రవి బస్రూర్ స్టూడియోలో కీబోర్డ్ తో కనిపించారు.

కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందుతుంది.
ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా,  రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News