Sunday, December 22, 2024

బాలీవుడ్‌లో కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

KGF New record in Bollywood

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రాజమౌళి నుంచి ఇటీవల వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సైతం ఆ రికార్డులను అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే ఇప్పటికే ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో ’బాహుబలి 2’ రికార్డులు పదిలంగా ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన ‘కేజీయఫ్: చాప్టర్ 2’ మూవీ మొదటి రోజు కొన్ని ఏరియాలలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులను అధిగమించింది. కన్నడ హీరో యష్, – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కెజిఎఫ్ 1’ సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనికి తగ్గట్టుగానే ‘కెజిఎఫ్ 2’ హిందీ వర్షన్ మొదటి రోజు వసూళ్ళలో ఆల్‌టైమ్ బాలీవుడ్ రికార్డ్‌ను సెట్ చేసింది. హిందీ మార్కెట్ లో ‘కెజిఎఫ్ 2’ మొదటి రోజు దాదాపు రూ. 53.95 కోట్లు వసూలు చేసింది. ఇంతకు ముందు బాలీవుడ్ చిత్రం ‘వార్’ 50.75 కోట్ల రికార్డుతో అగ్రస్థానంలో ఉండగా.. దాన్ని ఇప్పుడు ఈ మూవీ దాటేసింది.

అంతేకాదు ‘కేజీఎఫ్ 1’ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను (44.09 కోట్లు) ఒక్క రోజులో అధిగమించింది. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ హిందీలో తొలి రోజు 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇప్పుడు ‘కెజిఎఫ్ 2’ బాలీవుడ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసింది. ‘జెర్సీ’ సినిమా బరిలో నుంచి తప్పుకోవడం, అధిక టికెట్ ధరలు ‘కేజీఎఫ్-2’ కు కలిసొచ్చాయని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News