బెదిరింపులకు దిగితే నిజాంలకు,
రజాకార్లకు పట్టిన గతే బిజెపికి
మోడీ, అమిత్ షా నాపై
పగబట్టారు రిజర్వేషన్లు రద్దు
చేస్తారన్నందుకే నాపై కేసు
కేసులకు భయపడేవాణ్ని కాను
ఇలా వ్యవహరించినందుకే
కెసిఆర్‌ను ప్రజలు బొందపెట్టారు
గుజరాత్ ఆధిపత్యం
ప్రదర్శిస్తే పిఎంనైనా ఎదిరిస్తా
నాకు మద్దతుగా తెలంగాణ
ప్రజలు ఉన్నారు కోరుట్ల
జనజాతర సభలో నిప్పులు
చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ కోరుట్ల: అధికార బలంతో, గుజరాత్ ఆధిపత్యంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని బెదిరిస్తే ఊరుకునేది లేదని ‘ఖబడ్ద్దార్ మోడీ’ అంటూ సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా, కో రుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన జన జాతరసభలోఆయన ఘా టుగా ప్రసంగించారు.అధికారం ఉందనే ధై ర్యంతో బెదిరిస్తే నిజాంకు, రజాకార్లకు ప ట్టి న గతే పడుతుందని ప్రధానిని ఉద్దేశించి వ్యా ఖ్యానించారు. రిజర్వేషన్లపై బహిరంగం గా ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టారని ఆ రోపించారు. తెలంగాణలో కిషన్ రెడ్డి, బం డి సంజయ్, అరవింద్ లాంటి బిజెపి ఎంపిలు న్నా ఇక్కడ కేసు నమోదు చేయకుండా ఢిల్లీ లో కేసులు పెట్టడం ఎందుకని ప్రశ్నించా రు.
‘నీ గుజరాత్ ఆధిపత్యంతో బెదిరిస్తే 40 కోట్ల నా తెలంగాణ ప్రజలు, 50 లక్షల నిరుద్యోగ యువత ఊరుకోరు’ అని హెచ్చరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మా ర్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించారు. హెలికాప్టర్ ద్వారా మధ్యా హ్నం ఒంటి గంటకు కోరుట్లకు చేరిన రేవంత్‌రెడ్డికి పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్య ర్థి, పట్టభద్రుల ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఘ నంగా స్వాగతం పలికారు.పలువురు మం త్రులు, ఇన్చార్జీలు ప్రసంగిస్తుండగా సుమా రు 45 నిమిషాల పాటు సిఎం రేవంత్ వేదిక పై పార్టీ కీలక నేతలతో మాట్లాడి, ముఖ్య నా యకుల సన్మానాలు స్వీకరించి వారితో సెల్ఫీ లు దిగారు. ఢిల్లీ పోలీసుల నోటీసులో భా గంగా బుధవారం ఢిల్లీలో విచారణకు హాజ రు కావాల్సిన సిఎం రేవంత్ కోరుట్ల జన జా తర సభలో పాల్గొని, సుమారు 30 నిమిషాల పాటు వాడిగా, వేడిగా ప్రసంగించారు. మిత్రులారా…అంటూ తన ప్రసంగాన్ని ఆరంభించినముఖ్యమంత్రి మొదటగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి, ఆర్‌టిసి, విద్యు త్తు, రిక్షా, ఆటో కార్మికుల కృషి, త్యాగం మ రువలేనిదని కొనియాడారు. ప్రాణ సమానమైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులారా అని సం బోధిస్తూ.. ఇప్పుడు జరుగుతున్న 18వ పార్లమెంటు ఎన్నికలు ఆషామాషీవి కావన్నారు. 400 సీట్ల నినాదంతో వస్తున్న బిజెపి ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్ల ఎత్తివేతతో పాటు రా జ్యాంగ సవరణ కుట్రతో ఉందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లపై బహిరంగంగా ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టారని, తెలంగాణ లో పదేళ్ల పాలనలో 100 ఏళ్ల దోపిడీకి కారకుడైన కెసిఆర్ కూడా తన పాలనలో చేసింది ఇదే అన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కే సులు పెట్టడం, జైలుకు పంపడం జరిగిందం టూ ఈ కేసులు, జైలు తనకేమీ కొత్త కాదని రేవంత్ పేర్కొన్నారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రి గా, పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్న దేశ ప్ర ధాని మోడీ తన కంటే వయసులో పెద్దవాడని, వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తానని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం మెట్రో రైలు ఏర్పాటు, మూసీ నది ప్రక్షాళన, తాగునీటి కోసం కృష్ణా జలాల విషయమై నిధులడిగితే ఆయన మొండిచేయి చూపారన్నారు. మోడీ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చింది ’గాడిద గుడ్డు’ అంటూ సభకు హాజరైన జనంతో అనిపిస్తూ, గాడిద గుడ్డు నమూనా చూపుతూ ఎద్దేవా చేశారు. నిన్న తెలంగాణకు వచ్చిన మోడీ బయ్యారం ఫ్యాక్టరీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, పసుపు బోర్డు ఏర్పాటు, షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ గురించి మాట్లాడకుండా ప్రజలను మోసగించారని ఆరోపించారు. 43 సంవత్సరాల రాజకీయానుభవం ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్’రెడ్డి ఆరుసార్లు ఎంఎల్‌ఎగా, ఒక్కసారి ఎంఎల్‌సిగా, రాష్ట్ర మంత్రిగా నిస్వార్థంగా పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు.
జీవన్’రెడ్డికి లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తే ఈ కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు కొట్లాది రూపాయల నిధులిస్తానని పేర్కొన్నారు. రాబోయే ఇండియా కూటమి ప్రభుత్వంలో జీవన్‌రెడ్డిని వ్యవసాయ మంత్రిగా మనం చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మొదట జీవన్‌రెడ్డి, నర్సింగరావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మామిడి పరిశోధన, ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటూ హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగాలని కోరిన విషయాలను తప్పకుండా పరిశీలిస్తానని సిఎం పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంఎల్‌ఎలు ఆది శ్రీనివాస్, భూపతిరెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి, జగిత్యాల, కోరుట్ల నాయకులు పాల్గొన్నారు.