Wednesday, January 22, 2025

‘ఖడ్గం’ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, శివాజీ రాజా, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు.

భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశామని ఆయన అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “తరాలు మారినా దేశభక్తి సినిమాలు అన్నింటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. నా లైఫ్‌లో ఈ సినిమాను మర్చిపోలేను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, షఫీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News