Monday, January 20, 2025

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం NTR మార్గ్‌లో మహణపతి ముందుకు కదులుతున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వేలమంది జనం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనం సందోహంగా మారాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 700 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, మరికాసేపట్లోNTR మార్గ్‌లోని క్రేన్‌-4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం జరగనుంది. మధ్యాహ్నం 1.30 వరకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఇక, ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. గణేశుడి హుండీ ఆదాయం రూ.70 లక్షలుగాఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News