Sunday, February 2, 2025

ఈసారి ఖైరతాబాద్ లో పర్యావరణహిత గణేశుడు: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని పెట్టనున్నట్లు ఎంఎల్ఏ దానం నాగేందర్ తెలిపారు. గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

ఈసారి ఖైరతాబాద్ లో పర్యావరణహిత(ఎకో ఫ్రెండ్లీ) విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి భక్తుడికి ప్రసాదం అందేలా చూస్తామని కూడా ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News