Monday, December 23, 2024

కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు(గురువారం) ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు గణేష్ శోభాయాత్ర చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్ద హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తికానుంది. ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, గణనాథుల నిమజ్జనానికి నగరంలో 100చోట్ల అధికారులు నీటికొలనులు సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News