Thursday, January 23, 2025

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.  ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ చేపట్టారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం భారీ క్రేను ఏర్పాటు చేశారు. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.  గణేష్ శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ శోభాయాత్ర మార్గంలో సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News