మన తెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ వెల్లడించారు. ఈసారి 45 అడుగులు కుదిరితే అంతకంటే ఎత్తులోనే గణేష్ విగ్రహం ఉండే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత మిగతా వివరా లు తెలియచేస్తామని ఆయన తెలిపారు. ఈ గణపతికి త్రిము ఖ ఏకాదశ రుద్ర మహా గణపతిగా నామకరణం చేశామని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో ఖైరతాబాద్ గణేశుని విగ్రహం నమూనా విడుదల చేస్తామని సుదర్శన్ వెల్లడించా రు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో భక్తులకు దూరం నుంచే నిర్వాహకులు దర్శనభాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. జూలైలో ఏకాదశి రోజున నిర్వాహకులు కర్రపూజను ప్రారంభించగా ప్రస్తుతం విగ్రహం తయారీని శుక్రవారం నుంచి ప్రారంభించారు. గత సంవత్సరం 10 అడుగుల లోపే గణేశుడి విగ్రహాన్ని తయారు చేయగా, ఈ సారి ప్రభు త్వం అనుమతిచ్చే దానిపై ఎత్తు ఆధారపడి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.