Monday, December 23, 2024

ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారన్నారు. భక్తులు, నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందని,  మినీ ఇండియా గా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమైన విషయమన్నారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News