Friday, December 27, 2024

ఖజురహో-ఉదయ్‌పూర్ రైలు ఇంజిన్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహోఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు గ్వాలియర్ నుంచి బయలుదేరి సిథౌలీ స్టేషన్‌కు చేరుకుంటున్న కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు వచ్చినప్పటికీ అసలు మంటలు లేవని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్పష్టం చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొగను నివారించగలిగారు. మరో ఇంజిన్‌ను అమర్చి ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తామని అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News