- Advertisement -
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆదివారం ఖలిస్థాన్ జెండాలు, గోడలపై నినాదాలు దర్శనమిచ్చాయి. అయితే తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాటిని తొలగించింది. “ఇదంతా అర్ధరాత్రి నుంచి తెల్లవారు మధ్యలో జరిగి ఉంటుంది” అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంగ్రా ఖుశాల్ శర్మ తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఏ విశాల్ నెహ్రియా రాత్రి పూట చోటు చేసుకున్న ఈ ఘటనను ఖండించారు. పిరికిపందల్లా రాత్రి పూట ఇదంతా చేశారన్నారు. “మేము హిమాచలీలము, భారతీయులం. ఖలిస్థాన్ అని చెప్పుకునేవారికి భయపడేవాళ్లం కాము” అని ఆయన చెప్పారు. ఇదిలావుండగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సుధీర్ శర్మ దీనిని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఇదిలావుండగా సిసిటివిలు పనిచేయని పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -