భారత్-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్
న్యూఢిల్లీ : ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జీ 20 సదస్సు తర్వాత ఇవి మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా ఇరు దేశా ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రే క్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునః ప్రారంభిస్తామని భారత్ స్పష్టంగా చెప్పింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఓ మీడియా తో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
వాస్తవానికి జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందే భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కెనడా ప్రకటించిం ది. వచ్చే నెలలో ఆ చర్చలను తిరిగి ప్రారంభించాల్సి ఉండగా ఇప్పుడు మరోసారి వాటికి బ్రేక్ పడింది. అటు కెనడా కూడా ఈ చర్చలపై స్పందించింది. భారత్‌లో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్ ను వాయిదా వేయాలని ఆ దేశ వాణిజ్య మంత్రి మే రీ ఎన్జీ నిర్ణయించారు. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం కెనడా వెల్లడించలేదు.
ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేద నే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్రమోడ ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని , అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. భారత్, కెనడా మధ్య ఇప్పటివరకు ఆరు సార్లు వాణిజ్య చర్చలు జరిగాయి.