Friday, December 27, 2024

అమెరికాలో హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసిఆలయ గోడలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం వెలుపల ఉగ్రవాదులకు, వేర్పాటువాద శక్లుకు అటువంటి అవకాశం లభించకూడదని ఆయన అన్నారు. శనివారం నాడిక్కడ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవానికి హాజరైన జైశంకర్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వార్తలు తాను కూడా చూశానని, అటువంటి ఘటనలపై తాము ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. అక్కడి భారత కాన్సులేట్ ఇప్పిటకే ఘటనపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని, జరిగిన ఘటనపై పోలీసుల నుంచి సమాచారాన్ని తీసుకుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.

శ్రీస్వామినారాయణ్ మందిరాంలో విధ్వంసకాండ జరిగినట్లు శుక్రవారం ఉదయం 8.35 గంటల ప్రాంతంలో తమకు ఫోన్ వచ్చినట్లు కాలిఫోర్నియాలోని నెవార్క్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోల ప్రకారం ఆలయం వెలుపల ఉన్న సైన్‌బోర్డుపై ఖలిస్తాన్ అన్న రాతలతోపాటు ఆలయ గోడలపై అభ్యంతరకర రాతలు ఉన్నాయి. విద్వేషంతో కాని పక్షపాతంతోకాని బెదిరింపులకు, హింసకు, ఆస్తుల ధ్వంసానికి, వేధింపులకు లేదా నేరాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని నెవార్క్ పోలీసులు తెలిపారు. ఆలయాన్నిఅపవిత్రం చేసిన ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో నివసిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్‌ను హత్య చేయడానికి ఒక భాతతీయ అధికారితో కలసి కుట్రపన్నారన్న ఆరోపణపై జెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్టు చేయడం గురించి

జైశంకర్ మాట్లాడుతూ ఆ దేశంలో భారతీయ ఎంబసీ ద్వారా గుప్తాకు న్యాయ సహాయాన్ని అందచేసినట్లు చెప్పారు. 10వ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో అమెరికా, కెనడా పేర్లు ఆహ్వాన జాబితాలో లేకపోవడంపై ప్రశ్నించగా దీనిలో రాజకీయ అర్థాలు వెదకవలసిన అవసరం లేదని జైశంకర్ వ్యాఖ్యానించారు. వరిని ఆహ్వానించాలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, దీనిపై గుజరాత్ ప్రభుత్వమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News