Friday, December 20, 2024

పాకిస్తాన్ లో భింద్రన్ వాలే మేనల్లుడి మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ లో మరో కరడుగట్టిన ఉగ్రవాది మరణించాడు. ఒకప్పటి ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రన్ వాలేకు మేనల్లుడు, ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్ కు అధ్యక్షుడు అయిన లఖ్ బీర్ సింగ్ రోడే శనివారంనాడు గుండెపోటుతో మరణించాడు. ఇతను చాలాకాలంగా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్ వైఎఫ్) కు కూడా లఖ్ బీర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

లఖ్ బీర్ నేతృత్వంలోని ఐఎస్ వైఎఫ్ కెనడా, యునైటెడ్ కింగ్ డమ్ లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థకు లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నాయి. 2020లో శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ హత్య కేసులో లఖ్ బీర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News