Friday, January 24, 2025

అయోధ్య రామమందిరం పునాదుల్ని పెకలిస్తాం:ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్

- Advertisement -
- Advertisement -

వేర్పాటువాద నాయకుడు , ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్య లోని రామమందిరం సహా హిందూ ఆలయాలను లక్షంగా చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఈమేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. “ హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం ” అంటూ హెచ్చరించారు. ఈ వీడియోలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్థాన్ దాడులకు దూరంగా ఉండాలని కెనడా లోని భారతీయులను కూడా పన్నూన్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News