Thursday, January 23, 2025

కెనడాలోని భారతీయ హిందువులకు ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కెనడా లోని భారతీయ హిందువులు ఇండియాకు వెళ్లిపోవాలని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ , సిక్స్‌ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) నాయకుడు , ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూస్ బెదిరించాడు. ఈ మేరకు వీడియో వైరల్ అయింది. కెనడా పట్ల, ఆ దేశ రాజ్యాంగం పట్ల విధేయతను భారతీయ హిందువులు తిరస్కరించారని పన్నూన్ ఆరోపించాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని, అలాగే వారెప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఆ దేశ చట్టాలను రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ సమర్థించారని పేర్కొన్నాడు.

“ మీ గమ్యం భారత్. కెనడా విడిచిపెట్టి భారత దేశానికి వెళ్లండి ’ అని కెనడా లోని భారతీయ హిందువులను తాజా వీడియోలో బెదిరించాడు. కెనడా లో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన తరువాత ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులు వీడియోలో వైరల్ అయ్యాయి.

మరోవైపు అక్టోబర్ 29న కెనడా లోని సిక్కులంతా వాంకోవర్‌లో సమావేశం కావాలని పన్నూన్ అభ్యర్థించాడు. నిజ్జార్ హత్యకు భారత హైకమిషనర్ వర్మ బాధ్యుడైతే ఆనాడు నిర్వహించే రెఫరెండంలో పాల్గొనాలని కోరాడు. ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాలో గతంలో అనేక రిఫరెండమ్‌లు నిర్వహించారు. దీనిపై భారత్ అనేక సార్లు కెనడా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి ఆందోళన వ్యక్తం చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News