Thursday, January 23, 2025

కాంగ్రెస్ తో ఖల్లాస్…బిఆర్ఎస్ తో భేష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవడానికి దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చిందని మాజీ ఐఎఎస్ అధికారి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం దే శమే ఓడిపోయే పరిస్థితి తీసుకురావడం చాలా ప్రమాదకరమని అ న్నారు. మన చర్యల వల్ల దేశమే ఓడిపోయే పరిస్థితి వస్తే ఎవరు గెలుస్తారని ప్రశ్నించారు. ఓ టీవీ ఛానల్ కోసం మంత్రి కెటిఆర్‌కి ఇచ్చిన ఇంటర్వూలో జయప్రకాశ్ నారాయణ తన మనోగతాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ జయప్రకాశ్ నారాయణకు పలు ప్రశ్నలు సంధించారు. కెటిఆర్ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్ నారాయణ్ సమాధానాలు ఇచ్చారు.అయితేకాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారని కెటిఆర్ అడిగిన ప్రశ్నకు జెపి సమాధానం ఇచ్చారు. తనకు కాంగ్రెస్ అంటే గౌరవమని, ఎందుకంటే కొన్ని లక్షల మంది అభిమానులను చూరగొన్న పార్టీ అని చెప్పారు. అంతమంది అభిమానులు ఉండటం ఆషామాషి కాదని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. ప్రభుత్వాలు సా గుతున్న పరిపాలన గురించి మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలపై కూడా జెపి మాట్లాడుతూ, ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయితే కాంగ్రెస్ హామీలు దేశ భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉన్నాయని పేర్కొంటూ చాలా బాధతో ఈ మాట చెబుతున్నానని జెపి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పడం వల్ల రాష్ట్రాలు సర్వనాశమనమవుతాయని ఉదహరించా రు. పాత పెన్షన్ విధానాన్ని పరిశీలించి ఉద్యోగుల కు, ప్రజలకు న్యాయం జరిగేలా చేద్దామని కెసిఆర్ చెప్పారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం కోసం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గణాంకాలతో సం బంధం లేకుండా రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని, కచ్చితంగా ఆ రాష్ట్రాలు సర్వనాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమానికి పెద్దపీ ట వేయకుండా పరిపాలన సాధ్యం కాదని, ప్ర జాస్వామ్యం కాదని వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలు, నిరాశతో ఉన్న వర్గాలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించాలని చె ప్పారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం నమూనా సరైనది : జెపి
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న నమూనా నూటికి నూరు పాళ్లు సరైనదని, సంపద సృష్టించడం కోసం సరైన సదుపాయాలు కల్పిస్తే అభివృద్ధి పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా సంక్షేమం మరిం త పెరుగుతుందని వ్యాఖ్యానించారు. లేకపో తే ఉన్నకొద్దీ కుచించుకుపోతామని, ఇది మనకు అర్థం కావడం లేదని వాపోయారు. ఎ న్నికలు కేవలం గెలుపు ఓటముల కోసం కాదు అని…ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ల గురిం చి కాదు అని..ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించాలని ప్రజలను, ఓటర్లను కోరారు. ఎన్నికల సమయంలో ఏదోరకంగా రకరకాల టెక్నిక్‌లు ఉపయోగించి…ఒక అస్త్రం ఉపయోగించి ఎన్నికల్లో గెలిచామని అనుకుంటే రేపు రాష్ట్రం ఏమవుతుంది…దేశమవుతుందని అన్నారు. ఎవరు మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతా రో…ఎవరు సంపద పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతారో వారికి ఓటు వేయకపోతే పేదలు పేదలుగా నే మిగిలిపోతారని తెలిపారు. ఈ సమతుల్యత ఈ దేశం అంత తేలిక కాదని వ్యా ఖ్యానించారు. కచ్చితంగా సా మాన్య ప్రజల సంక్షేమం అవసరమే అని, తాత్కాలిక అవసరమే…కానీ దాంతోనే మన జీవితాలు గట్టెక్కవు అని అ న్నారు. సిఎం కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేశారని కొ నియాడారు. ఈ రెండింటినీ సమతుల్యం చేసిన వారికే మద్దతు ఇవ్వాలని జెపి ఓటర్లకు సూచించారు.

పనికిమాలిన పంచాయతీలు పెట్టకండని సిఎం చెప్పారు : కెటిఆర్
నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించాలి…కానీ పనికిమాలిన పంచాయతీలు పెట్టకండని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో చెప్పారని కెటిఆర్ తెలిపారు.వీటి గురించి ఐదేళ్ల తర్వాత ప్రజలు అడుగుతారని, మంత్రులు, ప్రజాప్రతినిదులు ప్రజల కేంద్రంగా పనిచేయాలని దిశానిర్ధేశం చేశారని పేర్కొన్నారు. భౌగోలికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలుగు ప్రజలు విడిపోరని, మానసికంగా ప్రజలు విడిపోరని సిఎం కెసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఏమాత్రం బేధబావం లేకుండా చేశారని జెపి కొనియాడారు.

హైదరాబాద్‌ను చూసి గర్వపడుతున్నా : జెపి
ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్ మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ఐటి రంగంలో 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించబడితే 1.50 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లో, 1.46 లక్షల ఉద్యోగాలు బెంగుళూరులో అని చెప్పారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు చెబుతుంటారని, అందుకు గత ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ మౌ లిక సదుపాయాలపై దృష్టి సారించాయని, దానిని తాము కొనసాగించడమే కాకుండా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని వారిని చెప్పానన్నారు. ఉత్తరాది వాళ్లు హైదరాబాద్‌కు వచ్చి ఆశ్చర్యపోతున్నారని, అందుకు హైదరాబాదీగా గర్వపడుతున్నానని జెపి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News