మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు
ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు
దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ
ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం నుంచి నేడు ఖమ్మంలో జరిగే బిఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీ ఎత్తున గులాబీ శ్రేణులు తరలివెళ్లుతున్నారు. గత ఐదారు రోజుల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు డివిజన్ నాయకులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కనివిని ఎరుగతి రీతిలో మహానగరం నుంచి తరలివెళ్లిన సభను విజయవంతం చేసేందుకు నడుం బిగించారు. సుమారు 2 లక్షలమంది వెళ్లుతున్నటు, ఇప్పటికే ప్రతి డిజన్‌కు ఇద్దరు బాధ్యలను నియమించి ఐదు బస్సులు, 10 కార్లలో సుమారు వెయ్యి మంది తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌గా ఆవిర్భావించిన తరువాత మొదటి సభ కావడంతో దేశ చరిత్రలో మరుపురాని సభగా నిలిచిపోయేలా చేస్తామంటున్నారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి దీటుగా నిలిచి వారి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఒకడేనని, ఆయనకు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మద్దతు పలికి సభ సక్సెస్ అయ్యేందుకు తమ సహాకారం అందిస్తున్నారు. ఖమ్మం సభకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నట్లు నగర మంత్రులు వెల్లడిస్తున్నారు. సభ స్థలికి కిమీ దూరంలో పార్కింగ్, సభ ప్రాంగణాకి వెళ్లేముందు ఆహారం, తాగునీరు అందించేందుకు సిద్దం చేసినట్లు, నగరం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం రెండు గంటల వరకు చేరుకుంటామని చెప్పారు. సెటిలర్లు నివసించే కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు సొంత వాహనాలతో ర్యాలీగా వెళ్లుతున్నట్లు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ టూ ఖమ్మం రహదారి గులాబీ సైనంతో నిండిపోతుందని, ఈదెబ్బతో విపక్ష పార్టీలు తోకముడుచుకోక తప్పదని పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సిఎం కెసిఆర్ రైతులు, కార్మికులు, యువత,మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం నిరంతర కృషి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేసి రాజకీయ పబ్బం గడపాలని ఇప్పటివరకు కలలు కన్నారు. ఖమ్మం సభతో వారికి ఉనికి లేకుండా పోతుందంటున్నారు. ఖమ్మం సభకు కదులుతున్న క్రామేడ్లు ః బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు కామ్రేడ్లు కూడ పెద్ద సంఖ్యలో కదులుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిఎం కెసిఆర్‌తో జతకట్టి మతతత్వ బిజెపిని మట్టికరిపిస్తామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు పార్టీ కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వామపక్ష పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వెల్లడించారు.