Sunday, January 19, 2025

ఖమ్మం సభకు జనాన్ని రాకుండా ఆపడం మంచి పద్ధతి కాదు: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జనాన్ని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. ఆదివారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సభా ప్రాంగణానికి 15-20 కి.మీ. దూరంలో పోలీసులు ఆపేయడం మంచిది కాదని హెచ్చరించారు. 35 ఏళ్ల  తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ వెంటనే సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

ఖమ్మంలో బహిరంగా సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పలువరు ముఖ్యనేతలు చేరనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎంఎల్‌ఎ భట్టి విక్రమార్కకు సన్మానం చేశారు. ఖమ్మం సభను ప్రతిష్టాత్మకంగా కాంగ్రేస్ నేతలు తీసుకున్నారు. కాంగ్రెస్ సభ దృష్టా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలుచోట్ల పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇప్పటికే వందల కొద్దీ వాహనాలను అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News