Monday, December 23, 2024

కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్ రావు ఠాక్రే

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: బిజెపితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమ్మక్కయ్యారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభ ఉన్నందున ఠాక్రే మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రజల సొమ్మును సిఎం కెసిఆర్ దోపిడీ చేశారని మండిపడ్డారు.

Also Read: దృశ్యం సినిమా… కుమారుడిని చంపి… పోలీసులకు చుక్కలు చూపించిన తల్లి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం సభకు రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఎపిలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాహుల్ కు ఎపి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ లో రాహుల్ ఖమ్మం చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News