Monday, December 23, 2024

బైక్‌పై నుంచి కాలువలో పడి…. తూములో ఇరుక్కొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తూములో ఇరుక్కొని దిచక్రవాహనదారుడు మృతి చెందిన సంఘట ఖమ్మం జిల్లా మధిర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా పెనుగంటిప్రోలు మండలం అనిగిళ్ల పాడు గ్రామంలో పోశెట్టి రమేష్ నివసిస్తున్నారు. రమేష్ మధిర నుంచి తన సొంతూరుకు వెళ్తున్నప్పుడు వైరా నదిపై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నాడు. ఈ క్రమంలో వైరా నది కాలువలో పడ్డాడు. నీళ్ల ప్రవాహంలో కొట్టుకొనిపోయి తూములో ఇరుక్కున్నాడు. స్థానికులు గమనించి తూములో నుంచి రమేష్, బైక్‌ను బయటకు తీశారు. అప్పటికే రమేష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News