Wednesday, December 25, 2024

అమ్మమ్మపై మనువడు హత్యాచారం?

- Advertisement -
- Advertisement -

ఖమ్మ: డబ్బుల కోసం మనువడు అమ్మమ్మను హత్య చేసిన సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని రోటరీ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమరబోయిన రాంబాయి(80) అనే వృద్ధురాలికి ఉదయ్(24) అనే మనువడు ఉన్నాడు. మద్యంతో పాటు జల్సాలకు అలవాటు పడడంతో అమ్మమ్మను వేధించుకొని పలుమార్లు ఉదయ్ డబ్బులు తీసుకునేవాడు. మంగళవారం ఉదయం అమ్మమ్మ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెను అతడు హత్య చేశాడు. దీంతో స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మపై హత్యాచారం చేసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News