Monday, December 23, 2024

కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కూసుమంచి : ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ లోడ్‌తో వెళుతున్న డిసిఎంలో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. డ్రైవర్ కు తోడుగా ఉన్న వాహనం యజమానికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే గమనించిన వాహనదారులు అతన్ని బయటికి తీసి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. డిసిఎం వాహనం అనకాపల్లి జిల్లా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News