Friday, December 20, 2024

హేమాహేమీల హోరాహోరీ

- Advertisement -
- Advertisement -

ఖమ్మంలో రాజకీయ దిగ్గజం
తుమ్మలతో సై అంటున్న మంత్రి
పువ్వాడ పాలేరులో మరో
ఉద్దండ నేత పొంగులేటితో ఢీ
అంటే ఢీ అంటున్న కందాళ అందరి
దృష్టి ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లపైనే
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రెండు
స్థానాల ఫలితాలపైనే ఉత్కంఠ

వనం వెంకటేశ్వర్లు/ఖమ్మం బ్యూరో:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్త దృష్టినే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతుంది. ఎందుకంటే ఇక్కడ అటూ అధికారపక్షం, ఇటూ ప్రతిపక్షం నుంచి రాజకీయ ఉద్దండులు, హేమాహేమిలు పోటీ చేస్తుండటం తో ఈరెండు నియోజకవర్గాలపై అందరిదృష్టి కేంద్రకృతం అయ్యింది. తెలంగాణలో సిఎం కెసిఆర్, ప్రతిపక్ష నేత రేవం త్ రెడ్డి సీట్ల కంటే ఇప్పుడు ఈరెండు సీట్లే హాట్ సీట్లుగా మారాయి. ఉమ్మడి జిల్లా నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్ధులు ఎవ్వరూ అసెం బ్లీ గేట్‌ను తాకనీవ్వనని శపథం చేసిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున పాలేరు సెగ్మెం ట్ నుంచి పోటీ చేయడం, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మిత్రుడైన రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వర్ రావు బిఆర్‌ఎస్ పార్టీని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తుండటంతోనే ఈ రెండు స్దానాలపైనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతటా అసక్తి రేపుతుంది.

ఉద్యమాల గుమ్మం, రాజకీయ చైతన్యానికి మారుపేరైనా ఉమ్మడి ఖ మ్మం జిల్లా ప్రతి ఎన్నికల్లో వీలక్షణమైన తీర్పునిస్తుంది.ఈ జిల్లాలో పది అసెంబ్లీ స్దానాలకు గాను మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈమూడింట్లో రెండు స్థ్దానాలైన ఖమ్మం, పాలేరు సెగ్మెంట్ల నుంచి హేమాహేమిలు తలపడుతున్నారు. ఖమ్మం సెగ్మెంట్ నుంచి ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బిఆర్‌ఎస్ తరుపున మూడోసారి పోటీ చేస్తూ ఏ విధంగానైనా హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతుండగా ఆయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఢీ కొడుతుండటంతో ఈ స్థానం అందరిదృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తుండగా అధికార బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరిరక్షించుకోబోతున్నారు.

ఈరెండు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తుమ్మల రాజకీయంగా తలపండిన ఉద్దండుగా పేరుగాంచగా, మాజీ ఎంపి పొంగులేటి సాక్షాతూ బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును ఎదురించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక స్థానంలో కూడా బిఆర్‌ఎస్ పార్టీ గెలువకుండా అడ్డుపడుతానని సవాల్ విసిరారు. అటూ పొంగులేటి, ఇటూ తుమ్మల ఇద్దరూ మొదటి నుంచి గురుశిష్యులు. వీరిద్దరూ బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇద్దరు ఏకమయ్యారు. వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఏ కమై ఇద్దరు కలిసికట్టుగా బిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు నడుంబిగించారు.

సాక్షాతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఈ రెండు స్థానాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఈ రెండు స్థానాలు ఎన్నికలు రసవత్తరంగా మా రాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానం మొదట్లో కమ్యూనిస్టులకు, ఆ తరువాత కాం గ్రెస్‌కు కంచుకోటాగా మారింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పువ్వాడ అజయకుమార్, ఆనాడు టిడిపి తరుపున పోటీ చేసిన అగ్రనేత తుమ్మల నాగేశ్వర్ రావును ఓడించి విజయం సాధించారు. ఆ తరువాత బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి ఆ ఎన్నికల్లో మహాకూటమి తరుపున టిడిపి నుంచి పోటీచేసిన మరో అగ్రనేత నామ నాగేశ్వర్ రావును ఓడించి గెలుపొందారు.2014 ఎన్నికల్లో అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ కమ్యూనిస్టు నేత పువ్వాడ నాగేశ్వర్ రావు తనయుడైన పువ్వాడ అజయ్ కుమార్ మొదటి, రెండు ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులను ఢీకొట్టి విజయం సాధించారు. 2014లోనే తుమ్మలను 5609 ఓట్ల తేడాతో ఓడించిన అజయ్ మరోసారి ఆయనపై తలపడుతున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేసిన పార్టీలు వేరు, ఇప్పుడు పోటీ చేసే పార్టీలు వేరు. ఆనాడు అజయ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా తుమ్మల టిడిపి నుంచి పోటీ చేశారు.

ఇప్పుడు అజయ్ బి ఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తుండగా తు మ్మల కాంగ్రెస్ నుంచి పో టీ చేస్తున్నారు. పాత పత్యర్థులే మరోసారి తలపడుతుండటంతో ఇరుపార్టీలోనూ అసక్తిగా మారింది. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపు న తుమ్మల పోటీ చేసి అపజయాన్ని ఎదుర్కొన్నప్పటికి 2009 ఎన్నికల్లో ఇదే ఖమ్మం సెగ్మెంట్ నుంచి టి డిపి తరుపున పోటీ చేసి అనాడు స్వతంత్ర అభ్యర్ధి గా పోటీ చేసిన జలగం వెంకట్రావ్ పై గెలుపొందా రు. నియోజకవర్గాల పునర్వీభజనలో తన సొంత సె గ్మెంట్ అయిన సత్తుపల్లి ఎస్సీలకు రిజర్వ్‌కావడంతో తు మ్మల ఖమ్మం సెగ్మెంట్‌కు వలస వచ్చి తొలి ప్రయత్నంలోనే విజ యం సాధించారు. అయితే 2014 ఎన్నికల నాటికి రాష్ట్రం వీడిపోవడం, ప్ర త్యేక తెలంగాణ అవిర్భావించడంతో టిడిపి ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అయిం ది. తెలంగాణలో టిడిపి బలహీనపడటంతో ఆయన ఆ ఎన్నికల్లో ఓటమిని చ విచూడక తప్పలేదు.

2018 ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం సీటును కాదని పా లేరు నుంచి బిఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి అక్కడ కూడా ఓటమిని చవిచూడాల్సివచ్చింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తుమ్మల గెలిచి ఉంటే ఆ ఎన్నికల్లే ఆయనకు చివరి ఎన్నికలు అయ్యేటివి. కాని ఆ ఎన్నికల్లో కొంతమంది సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఓడించారనే ఉద్దేశంతో ఈసారి ఏవిధంగానైనా గెలి చి తన పంతాన్ని నెగ్గించుకోవాలనే తాపత్రయంలో తుమ్మల ఉన్నారు. ముం దుగా పాలేరు నుంచే పోటీ చేయాలని భావించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టా నం సూచన మేరకు సామాజీకవర్గ సమీకరణలో భాగం గా ఖమ్మం నుంచి పో టీ చేయడం ఆయనకు అనివార్యం అయ్యింది. ఒక మారు ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయంతో పాటు రెండు పర్యాయాలు ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చే యడంతోపాటు దాదాపు17సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభ వం ఉండటంతో బి ఆర్ ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ కు ధీటుగా తు మ్మలను ఖమ్మం బరిలోకి దించారు.

తుమ్మల మాజీ మంత్రి కా గా పువ్వాడ ప్ర స్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఇద్ద రూ బలమైన నేతలు కావడంతో పాటు ఇద్దరూ ఒకే సామాజీకవర్గానికి చెం దిన వారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.ఢీ అం టే ఢీ అన్నట్లుగా ఒకరిపై ఒక్కరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. పోటీలు పడి విమర్శనాస్త్రాలను సంధించుకుంటుండటం తో నామినేషన్ల ఘట్టం ముగింపుకు ముందే రాజకీయవేడి రగులుతుంది.ఈసెగ్మెంట్లో క మ్మవర్గానికి చెందిన ఓట్లు దాదాపు 50వేలకు పైగా ఉన్నాయి. అ యితే ఇప్పు డు ఈ వర్గం ఓట్లలో ఎవ్వరూ మెజార్టీ ఓట్లను తమకు అనుకులం గా వేయించుకుంటారనేది అసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రిగా, ఖమ్మం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఏర్పడ్డ పాత పరిచయాలు, పాత టిడిపి మిత్రులను, తనసొంత సామాజికవర్గానికి చెందిన వారిని,అంతో ఇంతో బలం గా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని ముం దుకు సాగుతుండగా , బిఆర్‌ఎస్ అభ్య ర్ధి పువ్వాడ మాత్రం గతరెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఖమ్మం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, కెసిఆర్ ఛరిష్మాను నమ్ముకొని హ్యాట్రిక్ కొడ్తాననే గట్టి ధీమాతో ఉన్నారు. రాష్ట్రస్థాయిలో సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికి ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చేసరికి పొత్తు ధర్మాన్ని పాటిస్తారా? లేదా అనేది కొంచెం సంశేయంగా మారినప్పటికి పొటీ చేయకుండా తటస్థంగా ఉన్న టిడిపి ఓట్లు తనకు అనుకులంగా పోల్ అవుతాయనే నమ్మకంతో తుమ్మల ఉన్నారు.
పాలేరులో నువ్వా?-…నేనా?
ఇక పాలేరు సెగ్మెంట్లలో కూడా దాదాపు ఇంచుమించుగా ఇదే పరిస్ధితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రికే సవాల్ విసిరిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో కి దిగారు. 2014లో జరిగిన ఎంపి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి వై ఎస్ ఆర్ సిపి నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆ యన తన పార్టీని ఆనాటి బిఆర్‌ఎస్ పార్టీలో విలీనం చే శారు. 2019లో జరిగిన ఎంపి ఎన్నికల్లో తనకు టిక్కె ట్ కేటాయించకుండా ఆనాడు టిడిపి నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన నామా నాగేశ్వర్‌రావుకు టిక్కెట్ ఇ చ్చారు. అయినప్పటికి ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో నే కొనసాగా రు. అయితే ఈ ఏడాది జనవరి1 నుంచి బిఆర్‌ఎస్ అధినేతపై ధిక్కార స్వ రాన్ని విన్పించడం ప్రారంభించారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడట్టంతో పా ర్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత ఆయన కాంగ్రెస్‌లో చేరా రు. ఈ సందర్బంగా ఆయన కెసిఆర్‌ను ఎదురిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుం చి బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవ్వరూ అసెంబ్లీ గేట్‌ను కూడా తాకనివ్వనని భీష్మ ప్రతిజ్ఞ చే శారు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ కూడా ఆ శపధాన్ని సవాల్‌గా తీసుకొంది. ఇక్కడ బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కం దాళ గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి నాటి ఎన్నికల్లో తుమ్మల ఓడించి ఆ తరువాత బి ఆర్‌ఎస్‌లో చేరారు.
ఇప్పుడురెండోసారి తలపడుతున్నారు. ఈసారి కూడా మరో అగ్రనేత పొంగులేటితోసై అంటున్నారు. కూ సుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన కందా ళ తాను లోకల్ అభ్యర్ధిని అని, స్థ్దానికేతరులను నమ్మవద్దని ఓ టర్లను కోరుతున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఎవ్వరిపై విమర్శనాస్త్రాలనుసంధించకుండా కే వలం తాను చేసిన అభివృద్ధిని, ఎన్నికల మ్యానిఫెస్టోను మాత్రమే వి వరించుకుంటూ తనదైన శైలీ లో ముందుకు సాగుతుండగా, పొం గులేటి మాత్రం పదునైనా వి మ ర్శనాస్త్రాలను సంధిస్తు న్నారు. దీంతో వీరువురి మధ్య నువ్వా ? నేనా? అన్నట్లు పోటీ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News