Sunday, December 22, 2024

ఖమ్మం మున్నేరు వరదల్లో చిక్కుకున్న కుటుంబం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరదల్లో ఓ కుటుంబం చిక్కుకుంది. పద్మావతినగర్ లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. పసిపాపతో సహా ఏడుగురు వ్యక్తులు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేక 4 గంటలుగా కుటుంబం నిరీక్షిస్తోంది. మున్నేరు వరద ఉద్ధృతితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గంటగంటకు వరద పెరుగుతుండటంతో కుటుంబం భయాందోళన చెందుతోంది. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వదరల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News