Wednesday, January 22, 2025

చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా కేంద్రంలో భార్యకు భర్త చెవిదిద్దులు కొనివ్వలేదని అతడిని ఆమె తగలబెట్టింది. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా అనే దంపతులు నివసిస్తున్నారు. భార్యభర్తలు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెవి దిద్దులు కొనివ్వాలని పలుమార్లు భర్తను భార్య అడిగింది. ఆమె అడిగినప్పుడుల్లా అతడు పట్టించుకోకపోవడంతో శనివారం సాయంత్రం ఇద్దరు మధ్య చెవిదిద్దుల విషయంలో గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో విచక్షణ కోల్పోయిన భార్య పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని అతడిపై పోసి నిప్పంటించింది. భర్త లబోదిబోమంటూ పరుగులు తీయడంతో స్థానికులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News