Thursday, November 21, 2024

పాత బస్టాండ్‌పై… ‘కొత్త’ రాద్ధాంతం

- Advertisement -
- Advertisement -

బస్టాండ్ తరలింపుపై విపక్షాల ‘కస్సుబస్సు’
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
నగరంలో సిటీ బస్సులను నడపడం సాధ్యం కాదు : ఆర్టీసి
రెండు బస్సుస్టేషన్ల నిర్వహణ ఆర్టీసి సంస్థకు ఆర్థ్ధిక భారం
బస్ స్టేషన్ స్థ్ధలాన్ని ఎవ్వరికి ధారాదత్తం చేయబోం : మంత్రి పువ్వాడ

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: తెలంగాణలోనే హైద్రాబాద్‌నగరంలోని ఎంజిబిఎస్ తరువాత సర్వహంగులతో ఖమ్మంలో నిర్మించిన హైటెక్ బస్టాండ్ త్వరలో ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇప్పుడున్న పాత బస్టాండ్‌పై వివాదం తలెత్తింది. కొత్త బస్టాండ్ ప్రారంభం అయితే పాత బస్టాండ్‌ను ఏమి చేస్తారనే అంశంపై అటూ అధికార పక్షం, ఇటూ ప్రతిపక్షం మధ్య ‘కస్సుబస్సు’ల మాటల యుద్ధ్దం ప్రారంభం అయ్యింది. సాక్షాతూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ నాగేశ్వర్‌రావు స్వంత జిల్లా, సొంత నియోజకర్గ కేంద్రంలో తలెత్తిన ‘పాత’ బస్టాండ్ వివాదం ‘కొత్త’ రాద్ధ్దాంతం సృష్టిస్తుంది. కొత్త బస్టాండ్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్న విపక్షాలు అదే సమయంలో పాత బస్టాండ్‌ను తిరిగి సిటీ బస్టాండ్ లేదా గ్రామీణ బస్సుల బస్టాండ్‌గా యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్ చేస్తుండగా ఆర్టీసి అధికారులు మాత్రం ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితిలో ఖమ్మ ం నగరంలో రెండు బస్టాండ్‌లను నిర్వహించడం కష్టమని అందుకే పాత బస్టాండ్‌ను మూసివేస్తామని ఖరకండిగా చేబుతుండంతో ఇప్పుడు బస్టాండ్ వివాదం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా హట్ టాఫిక్‌గా మారింది.

ఖమ్మం నగర నడిబొడ్డున్న మయూరి సెంటర్ సమీపంలో ఉన్న బస్టాండ్ దాదాపు 40ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో ఎకరం స్థ్దలంలో పది ప్లాట్‌ఫారాలతో నిర్మించారు. ఈ నలబై ఏళ్ళకాలంలో నగరం వేగంగా విస్తరించింది. జనభా ప్రస్తుతం ఐదు లక్షల వరకు చేరుకుంది. ఖమ్మం బస్టాండ్‌కు రోజుకు లక్షలాది మంది జనం వచ్చి వెళ్తున్నారు.

దీంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలో జనం రద్దీతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎన్ ఎస్‌పి స్థ్ధలంలో ఏడు ఏకరాల స్థ్ధలంలో 30 ప్లాట్‌పారంలతో రూ.24 కోట్ల వ్యయంతో కొత్తబస్టాండ్ నిర్మాణానికి పునాది వేశారు. అప్పటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాయంలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కెటిఆర్ శంకుస్ధాపన చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు స్థ్ధానం దక్కడం, అందులో రవాణశాఖ పోర్ట్‌పోలియో లభించడం తో ఖమ్మంలోని నూతన బస్టాండ్‌కు మహర్దశ పట్టింది. అసలే ఆర్థ్దిక ఇబ్బందులతో తలమునకలవుతున్న ఆర్టీసి సంస్థ్ధకు కొత్త బస్టాండ్‌ల నిర్మాణం గుదిబండగా మారినప్పటికి కొన్ని నిధులు మున్సిపాల్టీ నుంచి అప్పుతీసుకొని ఎదో విధంగా నిర్మాణాన్ని పూర్తి చేయించారు. తన సొంత జిల్లాకు సంబంధించిన బస్టాండ్ కావడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార ఈ బస్టాండ్ నిర్మాణంను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాయివేగంతో నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నేడో రేపో ఈ నూతన బస్టాండ్ ప్రారంభం అవుతున్న తరుణంలో పాత బస్టాండ్‌ను ఏమి చేస్తారనే అంశంపై విపక్షాలు ఆందోళనలు చేయడం ప్రారంభించాయి. కాంగ్రెస్, సిపిఎం, న్యూడెమోక్రసి, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాన జనసమితి తదితర పార్టీలు బస్టాండ్ పరిరక్షణ అఖిలపక్ష కమిటీగా ఏర్పాటై ఇటీవల కాలంలో దశలవారిగా ఆందోళనలు చేయడం ప్రారంభించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజాబ్యాలెట్, బస్టాండ్ ముట్టడి, రౌండ్ టేండ్ సమావేశాలతో తమ కార్యచరణను ప్రారంభించారు. అందులో భాగంగా టిపిసిసి ఛీప్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా బస్టాండ్‌ను సందర్శించి వెళ్ళారు. అయితే కొత్త బస్టాండ్‌ను స్వాగతిస్తునే పాత బస్టాండ్‌ను కొనసాగించాలని విపక్షాలు చేస్తున్నవాదనపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మళ్ళీ అక్కడే బస్టాండ్ కొనసాగిస్తే

ట్రాఫిక్ పరిస్థితి ఏంటి?

ఇప్పుడున్న బస్టాండ్ పరిసరాల ప్రాంతాల్లో జనం రద్దీ విపరీతంగా ఉండి వైరా రోడ్డుపై నిత్యం ట్రాఫిక్‌జామ్ అవుతుందనే కొత్త బస్టాండ్‌ను నిర్మిస్తే మళ్లి ఇక్కడే బస్టాండ్ యధావిధిగా కొనసాగిస్తే మళ్లీ అదే ట్రాఫిక్ రద్ది ఉంటుందని ఇక కొత్త బస్టాండ్‌ను నిర్మించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఎక్స్‌ప్రెస్ బస్స్ సర్వీసుల బస్టాండ్ ఒక దగ్గర, గ్రామీణ సర్వీసులైన పల్లెవెలుగు బస్సులు నడిచే బస్టాండ్ మరో చోట ఉంటే అది ప్రజలకు ఇబ్బందిగా ఉండటమే కాకుండా వారిపై ఆర్థ్ధిక భారం కూడా పడబోతుంది. ఉదాహరణకు బొనకల్, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి ,చింతకాని, తిరుమలాయపాలేం, ఖమ్మం రూరల్ తదితర గ్రామీణ మండలాలకు చెంది హైద్రాబాద్ నగరానికి వెళ్ళాలనుకునే ప్రయాణీకులు పల్లెవెలుగు బస్సుల్లో పాత బస్టాండ్‌కు వచ్చి అక్కడ దిగి మళ్లీ ఆటోలో ఎక్స్‌ప్రెస్ బస్సు స్టాండ్‌కు వెళ్ళాలంటే ఆర్దిక భారంతో పాటు వ్యయప్రాసలకు గురై అవకాశం ఉంటున్నందునా ఎక్స్‌ప్రెస్,గ్రామీణ సర్వీస్‌లకు సంబంధించి ఒకే బస్టాండ్ ఉండాలనేది మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సిటీ బస్టాండ్ గా కొనసాగించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్టీసి ఖమ్మం లాంటి చిన్న పట్టణంలో సిటి బస్సులను నడిపించే సహసం చేసే అవకాశం లేదు.గతంలో ఖమ్మంలో సిటి బస్సులను నడిపించిన ఆర్టీసి చేతులు కాల్చుకుంది.ఖమ్మం కంటే పెద్ద నగరాల్లో కూడా ఇప్పటికి సిటి బస్సులు లేవు.తెలంగాణలో హైద్రాబాద్,వరంగల్ పట్టణాల్లో తప్పా ఏ జిల్లాలో సిటీ సర్వీస్‌లు లేవు. వరంగల్‌లో కూడా క్రమేణి సిటీ బస్సులను నడిపించడం తగ్గిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం నగరంలో ప్రతి ఇంటికి ద్వీచక్రవాహనం లేదా, నాలుగు చక్రాల వాహనాలు చాలా మందికి ఉన్నాయి. దీనికి తోడు ఖమ్మం నగరం కు ఏ దిక్కు చూసినా కిలో మీటర్ కంటే దూరం లేదు.

ప్రధాన రోడ్లు వైరా రోడ్డు, బైపాస్ రోడ్డు మాత్రమే కన్పిస్తాయి.నగరంలో50 డివిజన్లో ఇంటర్నల్ రోడ్లు 90 కి మీ దూరం వరకు ఉన్నప్పటికి అన్ని 30 అడుగుల ఇరుకు సి సి రోడ్లు మాత్రమే, ఆ రోడ్లపై ఆర్టీసి బస్సులు తిరిగే ఛాన్సే లేదు. కమన్‌బజార్, కస్బా బజార్ లాంటి చోట్ల సిటీ బస్సులు తిరిగే అవకాశాలే లేవు. ఆర్టీసి మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ తన సొంత నియోజకవర్గంలో తాను నివాసం ఉండే నగరంలో ఆర్టీసి సంస్థ్ధ ద్వారా సిటీ బస్సులను ప్రిస్టేజికి పోయి బలవంతంగా నడిపించవచ్చు. ఆర్టీసి మంత్రిగా సిటీ బస్సులను తన నగరానికి తీసుకొచ్చిన పేరు, ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది. కానీ మంత్రిగా ఆయన ఈ రోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు కానీ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసి సంస్థకు లాభసాటిగా ఉండాలేగాని నష్టాలు వచ్చే విధంగా ఉండవద్దు అనే ఉద్దేశ్యంతో ఆయన సిటీ బస్సుల నడపడంపై అయిష్టంగా ఉన్నారు. తన ప్రతిష్ట కోసం లాభసాటిలేని సిటీ బస్సులను తీసుకొచ్చి నష్టాలతో ముణ్నాళ్ళ ముచ్చటగా మూలకుపడేయడం ఎంత వరకు సబబు అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పాత బస్టాండ్‌ను ఏం చేస్తారనేదానిపైనే అంతా అసక్తి

ఇక కొత్త బస్టాండ్‌ను ప్రారంభిస్తే పాత బస్టాండ్‌ను ఏం చేస్తారనే ప్రశ్న అందరిని తొలచి వేస్తుంది. నగర నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన ఈ స్థలాన్ని కొంతమంది కార్పెరేట్ శక్తులకు కట్టబెట్టారని, లేదా జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనేతలకు దారదాత్తం చేశారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే అలాంటి ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని ఆర్టీసిని చూస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.గజం ఆర్టీసి స్థలాన్ని కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని ఆయన హామి ఇచ్చారు. ఆర్టీసి సంస్థకు,ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఇప్పుడున్న పాత బస్టాండ్ స్థ్దలాన్ని వినియోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసి ఆస్తులను ఆర్టీసి సంస్థ్ధే ఉపయోగించుకుంటుందని ఇందులో ఎటువంటి అనుమానాలు తావులేదన్నారు. ఆర్టీసి సంస్థ్ధ ఆధాయవనరుల అన్వేషణలో భాగంగా ఈ బస్టాండ్ స్థ్ధలాన్ని ఉపయోగించుకొని ప్రజా అవసరాల కోసమే ఉపయోగించే అవకాశం లేకపోలేదన్నారు. ఆర్టీసికి చెందిన విలువైన స్ధలాల్లో మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లను, కల్యాణ మండపాలను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించిన చరిత్ర ఉందన్నారు.

తెలంగాణలోని ఆర్టీసి ఆస్తులకు కాపాలదారుడిని తానే నని, ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ స్థలం విషయంలో ప్రతిపక్షపార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్టీసి ఆస్తిని ఎవ్వరికి దారదాత్తం చేసే ఉద్దేశ్యమే లేదన్నారు. ఆర్టీసి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఆర్టీసి ఆస్తులను పరిరక్షించే బాధ్యత మంత్రిగా తనపై ఉందన్నారు. ఆర్టీసి ఆస్తులను ముల్లు కర్ర పట్టుకొని కాపాడుకుంటానని, తాను మంత్రి అయిన తరువాత ఒక గజం స్థ్ధలం కూడా పక్కదారి పట్టలేదన్నారు. ప్రజలచేత పాతరేసిన, పాత బడ్డ్డా పార్టీలు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మరన్నారు. పాత బస్టాండ్ విషయంలో విపక్షాలు చేసే పాత పంథా దందాలను విరమించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News